ఆరడుగుల బుల్లెట్ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రావాలో తెలుసా..?

గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్టు. ఈ చిత్రం 2017 వ సంవత్సరం లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఆగిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా అలాంటి అడ్డంకులను తొలగించుకుని అక్టోబర్ 8న విడుదలయింది.అయితే ఈ సినిమా బిజినెస్ విషయం కూడా అంతంత మాత్రమే జరిగింది. ఇక బిజినెస్ వివరాల్లోకి వెళితే..

1). నైజాం-కోటి రూపాయలు.
2). సీడెడ్-50 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..2.70 లక్షలు బిజినెస్ జరిగింది.
4). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-25 లక్షలు.
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా..2.95 కోట్ల బిజినెస్ ని జరుపుకుంది.

ఈ సినిమా 2.95 క్రిటికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే మూడు కోట్ల రూపాయలను పెట్టాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే .. పోటీలో భారీ ధరకు అమ్ముడు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మరి వేచిచూడాల్సిందే ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో.