ఆ తల్లిదండ్రులకు దైవంగా మారిన సోనూ సూద్..ఏకంగా ప్రాణాలనే పణంగా..!!

సోను సూద్ ఎంత దయనీయడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని గురించి ఒక పుస్తకం రాసినా కూడా అది తక్కువే అవుతుంది.. కరోనా కష్ట కాలంలో ఎంతోమంది నిరుపేదలను ఆదుకున్న మహానుభావుడు గా పేదప్రజల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇకపోతే పేద ప్రజలకు మాత్రమే కాదు చిన్నారులకు కూడా గుండె ఆపరేషన్లు చేయించి వారి పాలిట దైవం గా మారుతున్నాడు.. సోనామసూరి సేవా కార్యక్రమం పై కొంతమంది విమర్శలు గుప్పించినా.. సోనూ సూద్ మాత్రం తన సేవా కార్యక్రమాలను ఏమాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు.. తాజాగా చిన్నారి ప్రాణాలను కాపాడి, ఆ తల్లిదండ్రులకు గొప్ప వరంగా.. దైవంగా మారాడు..

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన బిందు ప్రియా, కృష్ణ దంపతులకు ఒక సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు.ఈ బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే, వైద్యులు మాత్రం ఆపరేషన్ చేయడానికి ఏకంగా ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.. ఏం చేయాలో తెలియక చికిత్స కోసం బాబు తండ్రి ఎవరైనా సహాయం చేస్తారని ప్రయత్నిస్తున్న సమయంలో ని కృష్ణా జిల్లాకు చెందిన జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు చిన్నారి ఆరోగ్య సమస్య గురించి సోనూ సూద్ కి చెప్పగా.. చిన్నారి తల్లిదండ్రులను సోనుసూద్ ముంబైకి రప్పించారు.

ముంబైలోని వాడియా ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స జరిగింది. ప్రస్తుతం ఈ బాబు ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు చెబుతున్నారు.