ఈసారి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలో ఎన్నడూ లేని విధంగా చాలామంది సెలబ్రిటీలు ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ పై మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే.
ఇక మంచు విష్ణు చేసేటటువంటి హామీల కోసం మేము ఎటువంటి అడ్డం రాకుండా ఉండేందుకు ఈ రాజీనామా చేస్తున్నాము అన్నట్లుగా ప్రకాష్ తెలియజేశాడు. అయితే మంచు విష్ణు మా సభ్యత్వానికి రాజీనామా ఆమోదించనంటు వ్యక్తం చేశాడు. అసోసియేషన్లు ప్రకాష్ రాజు తిరిగి ఉండాలని నేను కోరుతానని తెలియజేశాడు.
అయితే ప్రకాష్ రాజ్ మాత్రం నేను నా రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటే నాది ఒక కండిషన్. అదే ఏమిటంటే.. నాన్ లోకల్ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎన్నికలలో ఓట్లు వేయడానికి. మరో విధంగా చేయడానికి నేను మా లో కొనసాగలేనని.. మా లో మార్పు తీసుకు వస్తే నాకు ఇందులో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రకాష్‌రాజ్ తెలియజేశారు. అయితే ప్రకాష్ రాజ్ కండిషన్‌ను మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయం ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతోంది.