ఎన్టీఆర్ కార్ల‌న్నిటికీ ఒకే నెంబ‌ర్ ఎందుకుంటుందో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు ప‌డుతుంటారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న గ్యారేజ్‌లో ప‌దికి పైగా కార్లు ఉండ‌గా.. ఈ మ‌ధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు.

6 Times Jr NTR Spent A Bomb For His Car Registration & Here's The Story  Behind It! - Filmibeat

అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ ద‌గ్గ‌ర ఉన్న కార్త‌న్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అస‌లు అన్ని కార్ల‌కు ఎన్టీఆర్ ఒకే నెంబ‌ర్ ఎందుకు వాడ‌తారు..? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఆ నెంబ‌ర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ, నిజానికి కార్ నెంబర్ విషయంలో ఎన్టీఆర్‌కు ఎలాంటి సెంటిమెంట్స్ లేవ‌ట‌.

Jayalalitha Photos For Car

మ‌రెందుకు ఒకే నెంబ‌ర్ వాడుతున్నారు అనేగా మీ సందేహం.. అందుకు ఓ కార‌ణం ఉంది. ఎన్టీఆర్‌కు 9 అనే అంకె అంటే ఇష్ట‌మ‌ట‌. అలాగే ఆయ‌న తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్‌ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పాడు. అందుకే మరో ఆలోచన లేకుండా తన కార్లకు అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని ఇటీవ‌ల ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Share post:

Popular