తహసీల్దార్ ను బండ బూతులు తిట్టిన కలెక్టర్.. కారణం?

September 3, 2021 at 8:35 pm

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయలేదని తహసీల్దార్ ను బండ బూతులు తిట్టాడు. కలెక్టర్ నోటిదురుసు తో అతను వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్ ను యూస్ లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. అయితే ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ను కలిశారు. ఒకే కుటుంబంలా భావించి వ్యాఖ్యలు చేసినట్లు కలెక్టర్ అన్నారు. కానీ పలు చోట్ల మాత్రం కలెక్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆడియో వైరల్ అయ్యింది.

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ తహాసీల్దార్ లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ తెలపాలని గుంటూరు తహశీల్దార్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అంతేకాకుండా కలెక్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ రేపు నిరసనలు కూడా చేపడతామని తెలిపారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదని తెలిపారు.

తహసీల్దార్ ను బండ బూతులు తిట్టిన కలెక్టర్.. కారణం?
0 votes, 0.00 avg. rating (0% score)