ఒక్క మాటతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సమంత?

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో రోజు రోజుకి ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. చైతన్య సమంతల మధ్య అభిప్రాయాలు తలెత్తాయని వారిద్దరి వివాహం విడాకుల వరకు వచ్చి, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయింది టాక్ వినిపించింది. దీనికి అనుగుణంగా సమంత కూడా ఒంటరిగా ఎంజాయ్ చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున సెప్టెంబర్ 20వ తారీఖున..నాకు స్పెషల్ డే..నా హీరో, నా ప్రియమైన మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు అంటూ ట్విట్టర్ లో ఒక వీడియో ని పోస్ట్ చేశారు. ఇది చూసిన సమంత దానికి రీ ట్వీట్ చేస్తూ ఇది చాలా బాగుంది అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఎప్పుడు నాగార్జున ను సమంత మామ అంటూ పిలిచేది.. కానీ ఈసారి మాత్రం ఏకవచనంతో నాగార్జున అని సరిపెట్టడంతో నితిన్ తో రచ్చ మొదలైంది. దీనితో సమంత అక్కినేని అభిమానులు సమంతా పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక దెబ్బకు దిగొచ్చిన సమంత ఇది చాలా బాగుంది నాగార్జున మామ అంటూ తన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసింది. మామ అనే పదంతో విడాకులపై సమంత చిన్న క్లారిటీ ఇచ్చింది అంటూ జనాలు వివిధ రకాలుగా రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

Share post:

Latest