వైరల్: గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎమ్మెల్యేకు లేఖ..!

సాధారణంగా ఎవరైనా సరే తమ ప్రాంత ఎమ్మెల్యేలకు.. అధికారులకు.. ఉద్యోగం కావాలని , తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని లేదా రోడ్లు వేయమని లేదా ఇంకేదైనా సదుపాయాలు కల్పించాలని అభ్యర్థిస్తూ ఉత్తరాలు రాస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇక్కడ ఒక యువకుడు మాత్రం అందరికంటే కొత్తగా ఆలోచించి, తనను ఏ అమ్మాయి చూడడం లేదని.. తాగుబోతులకు, తిరుగుబోతులకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ,తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ చూసి పెట్టండి మహాప్రభో అంటూ ఒక ఎమ్మెల్యే కు ఉత్తరం రాశాడు..

ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో నివాసం ఉంటున్న భూషణ్ జామువంత్ అనే యువకుడు.. ఆ ప్రాంత ఎమ్మెల్యే సుభాష్ కు తనకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అని తీవ్ర మనస్థాపానికి చెందుతూ.. అలాగే తన క్వాలిఫికేషన్ ని కూడా ఆ ఉత్తరంలో తెలియజేయడం జరిగింది . ఇక ఈ విషయంపై ఎమ్మెల్యే సుభాష్ స్పందిస్తూ ఇప్పటివరకు ఇలాంటి ఉత్తరాలు ఎప్పుడూ రాలేదని ఆయన తెలిపాడు.. ఇక ఆయన ఆ యువకుడిని కలిసి ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే , గర్ల్ ఫ్రెండ్ దొరకడం లేదంటూ అర్థంలేని ఆవేదన ఆరోగ్యానికి హానికరం అంటూ కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపాడు.. అయితే ఈ యువకుడిని ఎమ్మెల్యే వద్దకు తీసుకు వెళ్తారో లేదో వేచి చూడాలి మరి.

Share post:

Latest