వైరల్: గిన్నిస్ రికార్డు సాధించిన 107 యేళ్ళ కవలలు..!

సగటు మనిషి జీవితకాలం 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపే ఉంటున్న ఈ కాలంలో , ఇద్దరు కవలలు మాత్రం 107 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎంతో సంతోషంగా జీవిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. వీరు జపాన్ కు చెందిన కవలలు..వీరు ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ రోజులలో కూడా వీళ్ళు 107 యేళ్లు గా జీవించే ఉన్నారు. పైగా కవలలు.. దీంతో ప్రపంచ గిన్నిస్ సంస్థ తమ బుక్ లో వీరికి స్థానాన్ని కల్పించింది. గతంలో కూడా ఇలాంటి రికార్డు.. జపాన్ పేరు మీదే ఉండటం గమనార్హం..కానీ అప్పటి వృద్ధుల వయసు 107 ఏళ్ళ 175 రోజులు కాగా.. ప్రస్తుతం వీరు 107ఏళ్ళ 330 రోజులుగా నమోదు చేశారు.

1913లో జపాన్ లో షాడో దీవిలో వీరు జన్మించారు. వీరిపేర్లు ఉమెనో సుమియామా, కోమె కొడామా…వీరిద్దరూ కవలలుగా పుట్టినప్పటికీ , కుటుంబ పరిస్థితుల కారణంగా వేరు వేరు ప్రాంతాలలో జీవించి, వేరు వేరు గా వివాహం చేసుకున్నారు. కానీ ఎప్పుడు పండుగలకు ఉత్సవాలకు శుభకార్యాలకు మాత్రమే కలుసుకుంటూ ఆనందిస్తూ వుంటారు.. ఇటీవల ఇద్దరూ ఒకరి గా కలిసి జీవించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ బౌద్ధమతం స్వీకరించినప్పటి నుంచి ఇద్దరు కలిసి జీవిస్తున్నారు.అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వారికి జ్ఞాపక శక్తి లోపించి , ఈ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం లేకపోయింది. మరో మహిళ మాత్రం తమకు ఈ ఘనత లభించడం సంతోషంగా ఉందని తెలిపింది.