విజయవంతంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ..?

హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ రోజున ఒక చిన్నపాటి సర్జరీ చేస్తారన్న విషయం కూడా తెలిసిందే. అయితే గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టుగా అపోలో హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.తనకి ఇప్పుడిపుడే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుందని తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యాన్ని నిరంతర పర్యవేక్షిస్తున్న ట్లు వెల్లడించారు.

ఇక ఈ ఆపరేషన్ విజయవంతం అయిన తరువాత కొందరు సినీ నటుడు ఆస్పత్రిలో కి వచ్చి ఈ యువ హీరో ని పరామర్శించారు.ఇక అంతే కాకుండా కొంత మంది నటులు సోషల్ మీడియా ద్వారా సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నారు. ఇక సాయి ధరంతేజ్ ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో మందికి పలు విధాలుగా పలు సేవలను చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మంచితనమే ఈయన ఇప్పుడు కాపాడిందని అనుకుంటున్నారు నెటిజన్లు.

Share post:

Latest