విచారణలో నోరుమెదపని ఛార్మీ.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన అధికారులు..!

ఈరోజు ఛార్మి ఈడి అధికారుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఈడీ అధికారులు ఆమెను పలు కీలక ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.. ఇక చార్మి తనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంట తెచ్చుకుంది. ఇక తన వద్ద నుంచి బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈడీ ఆఫీస్ దగ్గర హంగామా చేసిన ఛార్మి బౌన్సర్ పై అధికారులు సీరియస్ అయ్యారు..

- Advertisement -

విదేశాలకు చెందినటువంటి కెల్విన్ కి ఈమె బదిలీ చేసిన లావాదేవీలపై అధికారులు ఆరా తీయడం జరిగింది..

ఇక ఆమెకు ఛార్మి చాలాసార్లు తన సొంత ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.. వ్యక్తిగత ఖాతా నుంచి కూడా డబ్బులు కెల్విన్ కి బదిలీ అయ్యాయని వారు గుర్తించడం జరిగింది.. ఇక పోతే ఛార్మికి , కెల్విన్ తో ఉన్న సంబంధాలను గురించి ఆమె నోరు మెదపడం లేదు. చార్మి నడుపుతున్న ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా డబ్బులు కెల్విన్ ఖాతా కు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు..

Share post:

Popular