వామ్మో..రెండోరోజు లవ్ స్టోరీ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత.. విడుదలయిన అతిపెద్ద సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా పుణ్యమా అంటు కొన్ని మూతబడిన థియేటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాను డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఎంతో అద్భుతంగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమా పై టాలీవుడ్ లోని సినీ స్టార్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమా రెండో రోజు ఎంత కలెక్షన్ రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఈ సినిమా మొదటి రోజు నుంచే బుకింగ్స్ జోర్ చాలా బాగా కొనసాగుతుంది.రెండో రోజు కూడా అదే జోర్ ను కొనసాగించి 9.66 కోట్ల షేర్ను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా..16.5 కోట్ల రూపాయలను సాధించింది. దీంతో చిత్ర సినిమాలో ఉన్న స్టార్స్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమాపై.

ఇక ఈ సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక పెద్ద సినిమా విడుదల చేయడం వల్ల, సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు ధైర్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు.