పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి?

బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగానటి సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. సెప్టెంబర్ 4వ తేదీన తమ కుటుంబంలో కి ఒక మగ బిడ్డ వచ్చాడని సమీరా తెలిపింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

కరోనా లాంటి విపత్కర సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసిన వైద్యులకు, అలాగే ఆమెకు తోడుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. దీనిని మొదట 2006లో వచ్చిన ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరీర్ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత బుల్లితెర నటుడు ప్రభాకర్ తో కలిసి ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఈమె నటించిన సీరియల్స్ లో ముద్దుబిడ్డ,అభిషేకం,భార్యామణి,మూడుముళ్ల బంధం సీరియల్స్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే అదిరింది షో కి కొద్దిరోజుల పాటు యాంకర్గా కూడా చేసింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆ బుల్లితెరకు దూరమయింది సమీరా.

Share post:

Popular