టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ తో ముమైత్ ఖాన్ ఫోన్ కాల్స్?

టాలీవుడ్ కేసు విచారణలో భాగంగా బుధవారం రోజు నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపుగా ఈ మెనూ ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ కొనసాగింది. అలాగే 2016 -17 కు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ ను అధికారులకు అందించింది ముమైత్ ఖాన్. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయినా కెల్విన్ తో ఆమె మాట్లాడిన ఫోన్, వాట్స్అప్ కాల్స్ పై అధికారులు ఆరా తీశారు. ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే నేపథ్యంలోనే తనకు పరిచయం అయ్యారని ముమైత్ ఖాన్ స్పష్టం చేసింది.

సినీ రంగానికి సంబంధించిన అంశాల పైనే అతడిని సంప్రదించానని, అంతకుమించి తనకు డ్రగ్స్ దందా తో సంబంధాలు లేవని ఆమె తెలిపింది. 2015-17 మధ్య తాను పెద్దగా తెలుగు సినిమాల్లో నటించాలని, ఎక్కువగా ముంబైలో ఉన్నారని తెలిపింది. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా నటించానని ఆ సందర్భంలో ఈవెంట్ మేనేజర్ గా కెల్విన్ కలిసే వాడిని వివరించింది. ఎఫ్ లాంజ్ క్లబ్ సహా అనేక పబ్బులకు తోనే వెళ్లిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించింది. ముమైత్ వీటిలో ఎక్కడ కొనలేదని, వాడ లేదంటూ ఆమె తెలిపింది.

Share post:

Latest