సిద్ధార్థ శుక్లది.. హత్యనా..?

September 2, 2021 at 9:03 pm

బుల్లితెరపై యాక్టర్ సిద్ధార్థ శుక్ల ఈరోజు ఉదయం కన్నుమూయడం జరిగింది.అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించాడని వార్త ఆయన అభిమానులకు నమ్మశక్యం కాలేదు.పైగా అతను చనిపోయే ముందు రోజు కొన్ని సంఘటనలు ఆయన చావుకి అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇక ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆయన కారు అద్దం పగలడం,ఈ కారు అద్దం పగలడం చేత ఆయన ఎవరితోనూ గొడవపడి ఉండవచ్చని ఆ గొడవ కారణంగానే ఇదంతా జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా సిద్ధార్థ శుక్ల మరణాన్ని హత్యగా మరికొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక సిద్ధార్థను కూడా సుశాంత్ రాజ్ పుత్ లాగే చంపేశారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరొకవైపు ఆయన తల్లి కుటుంబ సభ్యులు తెలిపిన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 1వ తేదీన తమ తల్లిదండ్రులతో కాసేపు నడిచిన సిద్ధార్థ ఆరోగ్యం బాగా లేదని వెళ్లి బెడ్రూంలో మందులు వేసుకొని పడుకున్నట్టు గా తెలియజేశారు.ఆ తరువాత ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు అన్నట్లుగా తెలియజేశారు. అయితే ఈ కేసును పోలీసులు త్వరగా తేలిస్తే అనుమానాలకు తెర పడుతుంది.

సిద్ధార్థ శుక్లది.. హత్యనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts