ప్రభుత్వం కొత్త నిబంధన.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టలేదు. దీన్ని నివారించడానికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోయి లేదు. అందువల్ల చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఇందులో ముఖ్యంగా మందుబాబులు ఎక్కువగా ఉన్నారట.వాక్సిన్ వేయించుకుంటే కొద్దిరోజులపాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎక్కువ ఉన్నారట.

అయితే అలాంటి వారికి తమిళనాడు ప్రభుత్వం ఒక ఫిట్టింగ్ పెట్టింది. వ్యాసం రెండు డోసులు వేయించుకున్న వారికి మాత్రమే మద్యం అమ్మేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే ఒక జిల్లాలో అమలు చేయడం స్టార్ట్ కూడా చేసింది. మద్యం కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలి. ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటుగా ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్లాలి. అప్పుడు మాత్రమే మద్యాన్ని అమ్ముతారు.ఈ విధంగా తమిళనాడు ప్రభుత్వం మందుబాబులకు తప్పక వాక్సిన్ వేయించుకునేలా నిర్ణయం తీసుకుంది.