శంకర్ సినిమాలో.. ట్రైన్ సీన్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో.. ట్రైన్ ఎపిసోడ్ అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమానే. బాలకృష్ణ పౌరుషానికి, మణిశర్మ బీజీయం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్ ని బాగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు.అదే తరహాలో.. ఇప్పటివరకు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు.

- Advertisement -

అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నటువంటి సినిమాల్లో అలాంటి ఒక సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కీలకమైన ఘటనలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటున్నట్లుగా సమాచారం. ఈ సీన్ తో రామ్ చరణ్ హీరోయిజాన్ని చాలా పవర్ఫుల్ గా చూపిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో ట్రైన్ సీన్ కోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సీన్ కోసం వందలాది మంది ఫైటర్లు అవసరమట. అందుకోసం ఓ సెట్ను కూడా వేయవలసి ఉంటుందట. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల రూపాయల మేరకు ఉండని ఉన్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో మరొక పాత్రలో హీరోయిన్ అంజలి సునీల్ కూడా నటిస్తున్నారు.

Share post:

Popular