నెటిజెన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన సమీరారెడ్డి?

నటి సమీరా రెడ్డి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర కూడా ఉంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు బిగ్గెస్ట్ డిజాస్టర్ లను ఇచ్చిన నాటు బామగా ఈమెను చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. కానీ కోలీవుడ్ బాలీవుడ్ లో రచ్చ చేసి అక్కడ విజయాలను సొంతం చేసుకుంది.

అలా చివరకు పెళ్లి చేసుకొని సినీ కెరీర్కు గుడ్ బై చెప్పేసింది. 2014లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడుపుతోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.ఇది ఇలా ఉంటే నటి సమీరా రెడ్డి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదే రీతిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది.

https://www.instagram.com/p/CUUDjmvNufY/?utm_source=ig_embed&ig_rid=d4589b57-90ec-4e11-b852-54c6f9ff28eb

మీకు 42 ఏళ్ళు ఉన్నాయనుకుంటా.. బాలీవుడ్ లో మీ వయసు ఉన్న హీరోయిన్ ల జుట్టు మాత్రం నల్లగా ఉంది? మీది మాత్రమే ఎందుకు ఇంత త్వరగా తెల్లబడి పోయింది అని అడిగాడు. దీనిపై స్పందించిన సమీరా రెడ్డి ఎంతో మంది ఆడవారు వాటిని కవర్ చేస్తారు. కొంతమంది కవర్ చేయరు. ఎవరి ఇష్టం వారిది.. అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.