ఆ విషయంలో ప్రియాంక చోప్రా కి థ్యాంక్స్ చెప్పిన సమంత?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో సమంత మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సమంత శాంకుతలం సినిమాను కంప్లీట్ చేసుకుని, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార తో పాటుగా కాతు వాకుల్ రెండు కాదల్ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి టు టు టు మ్యూజికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాటను చూసిన బాలీవుడ్ నటి ప్రియాంకా ఎంతో ఇంప్రెస్ అయ్యి, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సాంగ్ ఎంతో బాగుందని మూవీ టీమ్ కి కంగ్రాట్స్ అని తెలిపింది. అలాగే దర్శకుడు విగ్నేష్ కి బర్త్డే విషెస్ కూడా తెలిపింది. ఇక ఈ విషయంపై స్పందించిన సమంత నీ మాటలు మా విమల టీమ్ కి సంతోషాన్ని ఇచ్చాయని, ప్రియాంక చోప్రా కు థాంక్స్ చెప్పింది.

Share post:

Latest