సాయి త్వరగా కోలుకుంటున్నాడు అంటున్న మామ..ట్వీట్ వైరల్..!

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తుంటే.. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.. త్వరగా కోలుకుంటున్నాడు అని సమాచారం.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది..

సాయి ధరంతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు..! అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ కి రిపబ్లిక్ సినిమా విజయం కూడా కోలుకోవడానికి కావలసిన ధైర్యాన్ని అందిస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది.

ఇక సాయి ధరమ్ తేజ్ అభిమానులకు ఈ విషయం తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.. రిపబ్లిక్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది అంటూ కూడా వారు చెప్పడం గమనార్హం.

Share post:

Latest