సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..?

మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం పై ఇంకా ఆయన అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడంతో ఎప్పుడు కోలుకుంటాడు అన్న టెన్షన్ నెలకొంది ఆయన అభిమానులలో.. ఇక హీరో మోహన్ బాబు తన కూతురుతో కలిసి అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ ను పరామర్శించాడట.

తన ఆరోగ్యం నిలకడగా ఉందని తను రెండు మూడు రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలియజేశాడు. ఇక సెప్టెంబర్ 10వ తేదీన ఈయన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

సాయి ధరంతేజ్ ఆరోగ్యం గా బయటికి రావాలని ఆయన అభిమానులు, ఆయన సహాయం పొందిన వ్యక్తులు, సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ ఎప్పుడు అవుతాడు అనే విషయం అధికారికంగా తెలిపితే బాగుంటుందని తన అభిమానులు ఆలోచిస్తున్నారు.

Share post:

Latest