రిస్క్ తీసుకుంటున్న ఎమ్. ఎస్. రాజు ..కారణం..?

ఎమ్మెస్ రాజు ప్రముఖ చిత్ర నిర్మాత గా గుర్తింపు పొందిన ఈయన , ఎన్నో చిత్రాలను తనదైన శైలిలో నిర్మించిన విషయం తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన సినిమాలలో కొత్తదనాన్ని కోరుకునే ఎం.ఎస్.రాజు.. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి సరికొత్త సాంకేతిక నిపుణులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.. అయితే అందులో భాగంగానే ఇప్పుడు కూడా తన తదుపరి చిత్రం -7 డేస్ 6 నైట్స్ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, 16 సంవత్సరాల వయసులో అద్భుత ప్రతిభ కనబరిచిన సమర్త్ గొల్లపూడి ని పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

16 సంవత్సరాలకే సంగీత దర్శకుడిగా అడుగుపెడుతున్న ఇతడితో రిస్క్ చేస్తున్నాడా..? అన్నట్లు నెటిజన్ల నుంచి వార్తలు కూడా వినిపిస్తున్నాయి.సమర్త్ గొల్లపూడి టి ఎఫ్ ఐ లో ప్రముఖ సంగీత దర్శకులతో పని చేసినప్పటికీ, ఈ చిత్రానికి ఇతడే సంగీతానికి అర్హుడు అని ఎం.ఎస్.రాజు భావించాడు.. ఈ సినిమా కోసం సంగీతదర్శకుడిగా సమర్త్ సంతకం కూడా చేయడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా శరవేగంగా రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది.