రాజు ఆత్మహత్యపై అత్త యాదమ్మ నమ్మలేని నిజాలు..?

హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజు ఈరోజున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక గత కొన్ని రోజులుగా ఈ యువకుడు పరారీలో ఉన్నారు. అయితే నిందితుడు చివరికి శవమై కనిపించాడు. ఇక చిన్నారిపై అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడికి సరైన గుణపాఠం జరిగిందంటూ కొంతమంది కామెంట్ తెలియజేస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ విషయంపై రాజు అత్తమ్మ యాదమ్మ ఏ విధంగా స్పందించింది అంటే.. చిన్నారిని చిదిమేసి ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన వాడికి బతికే హక్కు లేదని, ఆత్మహత్య చేసుకొని మంచి పని చేశాడంటూ తెలుపు కొచ్చింది. ఈ పాప జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా,తన కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశాడంటూ తన మనస్సులోని ఆవేదనను వ్యక్తం చేసింది.

ఇక గత కొద్ది రోజుల కిందటే యాదమ్మ ని కూడా అతడి గొంతు నొక్కి పోయాడని, నా కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని తెలియజేసింది. ఇక ప్రతి రోజూ మద్యం సేవించి తన కూతురిని వేధించేవాడని యాదమ్మ బోరున విలపిస్తూ తెలియజేసింది. ఏది ఏమైనా రాజ అత్త ఇలా మాట్లాడడం వల్ల ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది.

Share post:

Popular