ప్రభాస్‌ను భయపెడుతున్న సినిమా..?

టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇప్పటికే రిలీజ్ డేట్‌లను లాక్ చేసుకున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదని అందరూ అనుకుంటున్నారు.

అయితే ఈ మూడు సినిమాలతో పాటు మరో పాన్ ఇండియా మూవీ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్తతో ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం అయోమయంలో పడింది. ఆర్ఆర్ఆర్ చిత్రం గనుక సంక్రాంతికి రిలీజ్ అయితే తమ రాధేశ్యామ్ చిత్రాన్ని తప్పకుండా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం మంచిది కాదని, ఆ ప్రభావం రెండు సినిమాలపై పడుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ లెక్కన సంక్రాంతి బరిలో ఒకే పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కానుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి వచ్చే సంక్రాంతికి రాధేశ్యామ్ రిలీజ్ అవుతుందా లేక ఆర్ఆర్ఆర్ చిత్రం బరిలో ఉంటుందా అనేది చూడాలి.

Share post:

Latest