పుష్పక విమానం ఎగిరేది అప్పుడేనట!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఎలాంటి స్టార్‌గా ఎదిగిపోయాడే మనం చూశాం. కాగా ఈ హీరో తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆనంద్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో.

కాగా అలనాటి క్లాసిక్ మూవీ ‘పుష్పక విమానం’ టైటిల్‌తో రాబోతున్న ఆనంద్ దేవరకొండ చిత్రం పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథతో రానుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. పుష్పక విమానం చిత్రాన్ని నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో లెక్కల మాస్టార్ పాత్రలో ఆనంద్ దేవరకొండ నటిస్తుండటంతో ఈ సినిమాలో అతడి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో గీతా సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. దామోదర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, విజయ్ దేవరకొండ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సునీల్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో వారి పాత్రలో ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.