మా సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు.. అందుకోసమేనా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల సాగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ మా ఎన్నికల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. అయితే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ నువ్వు ప్రకటించారు. ఈయన ప్యానల్ లో జీవితా రాజశేఖర్, అలాగే హేమ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మధ్యనే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చి జీవిత రాజశేఖర్ పై కామెంట్ చేయడం తో మరో వివాదానికి తెరలేపింది. అంటే జీవిత రాజశేఖర్ కూడా బండ్ల గణేష్ కు దీటు గానే సమాధానం చెప్పింది.

ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ మా సభ్యుల కోసం స్పెషల్ గా ఒక విందును ఏర్పాటు చేశారు. మా బిడ్డలు అంతా కలసి ఇంటరాక్ట్ అవుదామని, మన విజన్ ఏంటో షేర్ చేసుకుని అన్ని విషయాలు చర్చించుకుందాం అని ప్రకాష్ తన ఆహ్వానం లో తెలిపారు. ఇక ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మీటింగ్ ఉంటుందని తన ఆహ్వాన పత్రిక ద్వారా ప్రకాష్ రాజ్ తెలిపారు. దీనితో ఈ మీటింగ్ లో అసలు ఏం చర్చ జరుగుతోంది అనే ఆసక్తి నెలకొంది.

Share post:

Popular