ఒంటరిగా ఉన్నప్పుడు శృతిహాసన్ చేసే పనులు ఇవే..!

శృతిహాసన్.. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.. ఇకపోతే గత కొన్ని నెలల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేస్తోందో అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమైంది.. అవేంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం..

శృతి హాసన్ టాప్ సీక్రెట్ టాక్ థెరపీ అట.. ఆమె అభిమానులకు చెప్పే మాట ఏమిటంటే… నీతో నువ్వు మాట్లాడుకో.. ఎప్పుడైతే మనం మనతో మాట్లాడుకుంటామో, అప్పుడు అన్ని సమస్యలను స్వయంగా పరిష్కరించుకోగలుగుతాము అని చెబుతోంది శృతిహాసన్.. ముఖ్యంగా తను ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటూ టాక్ థెరపీ ద్వారా తనతో తాను మాట్లాడుకొని, కొన్ని సమస్యలను స్వయంగా పరిష్కరించుకుందట.

శృతి హాసన్ మాట్లాడుతూ.. సాధారణంగా చిన్నప్పటినుంచి మనందరి లో ఏవో కొన్ని ఆత్మ న్యూనతా భావాలు ఉండే ఉంటాయి. వీటి గురించి మనం ఏదో ఒక సమయంలో ఆందోళన చెందుతూనే ఉంటాము.. కాబట్టి వీటిలో కొన్నింటికి మనం టైం కేటాయించుకుని , మనతో మనం వాస్తవాలు చర్చించుకోగలిగితే కొన్ని సమస్యలు దూరమై పోతాయి.. నా వరకు ఈ సెల్ఫ్ టాకింగ్ థెరపీ చాలా బాగా వర్కౌట్ అయింది..ముఖ్యంగా ఇతరులు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో..? ఏవిధంగా అర్థం చేసుకుంటున్నారో..? అని ఆలోచించకు.. నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి ఎంజాయ్ చెయ్ అని తెలుపుతోంది శృతిహాసన్.