నేను లేని నా ప్రేమకథ.. రిలీజ్ అయ్యేది అప్పుడే..?

నవీన్ చంద్ర తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి.. నవీన్ చంద్ర కొంతకాలం వరకు సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.ఇప్పుడు సరికొత్తగా నేను లేని నా ప్రేమకథ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు..

త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం యుఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర వంటి వారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్లో నటించారు.

ఇక ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వినూత్న కథాంశంతో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ తెరకు ఎక్కించపోతున్నాము.. మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న యుఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ 8న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు. విడుదలైన తర్వాత ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో మనం వేచి చూడాలి.

Share post:

Latest