త్వరలోనే పెళ్లి.. కాబోయే భర్తకు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చిన నయనతార?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాలలో నటిస్తూ అదరగొడుతోన్న అందాల రాశి నయనతార. ఇదిలా ఉంటే గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. నయనతార తనకు కాబోయే భర్త విగ్నేష్ కు గ్రాండ్ గా సర్ ప్రైజ్ ఇచ్చింది.

విగ్నేష్ 36 వ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ పార్టీతో ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేశ్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో చేశారు. ఈ సందర్భంగా నయనతార ను ఉద్దేశించి నీ వునికి నా జీవితంలో ఏ బహుమతితో పోల్చలేనిది.. థాంక్యూ థంగమే అంటూ నయనతార పై ప్రేమ కురిపించారు విగ్నేష్. అలాగే తనకు పుట్టిన రోజు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విఘ్నేశ్వర దర్శకత్వం వహిస్తున్న కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోందని ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార తో పాటు గా సమంత కూడా నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు.