నవీన్ పోలిశెట్టి.. సినిమాలో నటించడానికి.. అన్ని కోట్లు అడిగాడా..?

ఏజెంట్ ఆత్రేయ సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి.ఇక జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా మారిపోయాడు. ఇంతటి ఘన విజయం అందుకున్న నవీన్ పోలిశెట్టి ఆఫర్లతో హడావిడి చేస్తున్నారు.కానీ ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడులో లేడట. అందుచేతనే దిల్ రాజ్, మైత్రి మూవీ మేకర్స్,సితార ఎంటర్టైన్మెంట్ వంటి సినిమాలకు నవీన్ పోలిశెట్టి ఓకే చెప్పి అడ్వాన్సు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక తాజాగా నవీన్ పోలిశెట్టి సితార ఎంటర్టైన్మెంట్ పై సినిమా తీసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఇక రంగేదే కో డైరెక్టర్ తో నవీన్ కి కథ చెప్పించారు.ఆ కథ నచ్చిన ఆ ఈ కథలోని కొన్ని మార్పులను చేశాడు నవీన్ పోలిశెట్టి. అలా చేసిన ఆ కథ సరిగ్గా లేకపోవడంతో.ఆ సినిమాను వదిలేస్తున్నారని మాట ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి 4 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా ఈ సినిమా కథ నచ్చకపోవడంతో సితార ఎంటర్టైన్మెంట్ వారు వేరొక కధనం కోసం వెతుకుతున్నట్లు సమాచారం.