ఐదేళ్లుగా అతడితో డేటింగ్.. ఇప్పుడు గుట్టు రట్టు చేసిన నటి?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల లవ్ విషయాలు, అలాగే డేటింగ్ విషయాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ విషయాల పట్ల అవగాహన సెలబ్రిటీలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక ప్రముఖ నటి మాత్రం గతంలో తాను ఒక వ్యక్తి తో దాదాపుగా ఐదేళ్లు ఒక నటుడితో డేటింగ్ చేశాను అంటూ ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు నర్గీస్ ఫక్రీ. ఈమె ప్రముఖ నటుడు ఉదయ్ చోప్రా తో ఐదేళ్ల పాటు సుదీర్ఘ డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. ఈమె ఉదయ్ చోప్రా తో కలిసి డేటింగ్ చేశారని సహజీవనం చేస్తూ ఉందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా వీటిపై అప్పట్లో సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు కూడా వినిపించాయి. ఇక ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గిస్ ఫక్రీ ఓపెన్ అవుతూ ఉదయ చోప్రా తో ఐదేళ్లు తాను డేటింగ్ లో ఉన్నాను అంటూ తెలిపింది. అయితే అప్పట్లో మీ రిలేషన్ షిప్ గురించి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని అందుకోసం తమ రిలేషన్ గురించి బయట ప్రపంచానికి వెల్లడించలేదు అని ఆమె తెలిపింది.

Share post:

Popular