అఖిల్ ఏజెంట్ నుంచి తమన్ ఔట్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని హీరో అఖిల్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత తీస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రెండు వెరియేషన్స్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా తమన్ నీ ఎంపిక చేసుకున్నారు. కానీ తాజా అప్డేట్ ప్రకారం తమన్ కు బదులుగా ఈ సినిమాలో మేకర్స్ మ్యూజిక్ కంపోజర్ ను మార్చారని తెలుస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్లో ఫుల్ పామ్ లో ఉన్నాడు.ప్రస్తుతం తెలుగు తమిళం ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. తమన్ బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదట. అలా మూవీ యూనిట్ కూడా తమను సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదట. దీనితో ఏజెంట్ సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పేరు హిపాప్ తమిజా. అంతేకాకుండా ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయినట్లు కూడా తెలుస్తోంది.

Share post:

Latest