మానవత్వం మేల్కొన్న వేళ..ఆ నీచుడు కోసం కదిలివచ్చిన ఉద్యోగస్తులు..?

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిన వార్త సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతోంది. ఇప్పటికి నిందితుడు రాజు బయట తిరుగుతూ ఉన్నాడు.నిందితుడి ఆచూకీ తెలిపినవారికి పదిలక్షల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు సైతం ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తునారు.

ఇక ఇప్పుడు అందరి మాట ఒక్కటే.. ఆ నిందితుడు రాజు అని కఠినంగా శిక్షించాలి అని కోరుకుంటున్నారు. హైదరాబాదులో ప్రభుత్వ,ప్రైవేటు,సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది అతని వెతుకులాట కోసం సెలవులు కావాలని కోరుకుంటున్నారు. మాకి ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి ఆ దుర్మార్గుడుని ఎక్కడున్న పట్టి తీసుకొస్తా మంటూ అర్జీలు పెడుతున్నారట. కేవలం ఇదంతా డబ్బు కోసం అయితే కాదు అలాంటి నీచపు ఇలాంటి సమాజంలో ఉండకూడదు అని ప్రజలు మండిపడుతున్నారు.

ఈ విషయంపై కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని చాలా వరకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు కోరుతున్నారు. ఆ బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయంగా ఇలాంటి పని చేస్తామని ముందుకు వస్తున్నారు.

Share post:

Latest