గబ్బర్ సింగ్ బ్యూటీపై దారుణమైన ట్రోల్స్.. కారణం ఏమిటంటే?

గబ్బర్ సింగ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.ఈమె తన ఫిట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఈ 47 ఏళ్ల బ్యూటీ ని ఈమె అభిమానులు టిన్సెల్ టౌన్ యమ్మీ మమ్మీ అని పిలుచుకుంటుంటారు. జిమ్‌ చేయడం దగ్గర నుంచి బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయం వరకు ప్రతి ఒక్క విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. ఈమె నిత్యం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల యోగా క్లాసెస్‌కి వెళ్లిన సమయంలో వాకింగ్‌ స్టైల్‌ గురించి ఈ భామని విపరీతంగా ట్రోల్‌ చేశారు నెటిజన్లు.

ఈమె క్రమం తప్పకుండా యోగా క్లాస్ కి వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబైలోని ఒక యోగా సెంటర్ కు వెళ్ళిన క్రమంలో ఆమె నడిచిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేం స్టైల్ బై.. అనే కామెంట్స్ మెగా మరొక నెటిజన్ ఇండియా నెక్స్ట్ సూపర్ మోడల్ షో జడ్జి గా చేయనుంది అంటూ సరదాగా కామెంట్ చేశారు. మరికొందరు అయితే ఈమె నడకను బాతు నడకతో పోతున్నారు.