మహేష్ బాబు కాదన్నాడు.. విజయ్ చేసి చూపిస్తాడా..?

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి..ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఎంతటి విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. అంతేకాదు ఎన్నో సైమా , నంది అవార్డులతో పాటు ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రెండు సాక్షి అవార్డులు కూడా అందుకున్నారు మహేష్ బాబు. ఇకపోతే వంశీ పైడిపల్లి ఈ టీం తోనే మరో సినిమా చేయాలని అనుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తాను రాసుకున్న ఒక సూపర్ హిట్ స్క్రిప్ట్ ను మహేష్ బాబుకు వినిపించగా , ఆయనకు నచ్చక పోవడంతో రిజెక్ట్ చేయడం జరిగింది.

కానీ తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి అనుగుణంగా ఉండేలాగా, కోలీవుడ్ దళపతి గా గుర్తింపు పొందిన విజయ్ హీరోయిజానికి తగిన కొన్ని సన్నివేశాలను స్క్రిప్టు లో యాడ్ చేసి, విజయ్ కు వినిపించాడు.. కానీ యాదృచ్చికంగా విజయ్ కు ఈ కథ నచ్చడంతో, వెంటనే ఓకే చెప్పేశాడు.. నిజానికి విజయ్ దళపతి కి మహేష్ బాబు వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చలేదు అని తెలిసినప్పటికీ, వంశీ పైడిపల్లి మార్పులు చేర్పులు చేసిన తర్వాత కథ వినడం తో బాగా నచ్చిందని విజయ్ తెలిపినట్లు సమాచారం.

అంతేకాదు ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా ఈ సినిమాకు దళపతి 66 అనే టైటిల్ ని కూడా నిర్ణయించుకున్నారట. ఇక పోతే విజయ్ తమిళంలో బీస్ట్ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు.. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అంతేకాదు విజయ్ దళపతి కి దిల్ రాజు వంద కోట్ల రెమ్యూనరేషన్ కూడా అందించడం జరిగింది.. మొదటిసారి తమిళ్ హీరో .. తెలుగు సినీ ఇండస్ట్రీలో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా విజయ్ కూడా గుర్తింపు పొందాడు. ఇకపోతే ఈ సినిమా పట్టాల కి ఎంత విజయాన్ని అందుకుంటుందో మనం వేచి చూడాల్సిందే.