బిగ్‌బాస్ 5: ఫ‌స్ట్ నువ్వే వెళ్తావ్‌..ఆ కంటెస్టెంట్‌పై కౌషల్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వ‌ర్యంలో మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆదివారం సాఫీగా సాగిపోయిన ఈ షో సోమవారం మాత్రం నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో హాట్ హాట్ గా మారిపోయింది.

Kaushal bags record number of votes in Bigg Boss history

కొందరు ఏడుపులు, మరికొందరి కామెడీ, ఇంకొందని క్లాస్‌లతో రంజుగా నామినేష‌న్ ప్ర‌క్రియ సాగ‌గా.. చివ‌ర‌కు యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జస్వంత్ (జెస్సీ)లు నామినేట్ అయ్యారు. అయితే తాజాగా మోడ‌ల్ జెస్సీపై బిగ్ బాస్ సిజ‌న్ 2 విన్న‌ర్ కౌష‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Bigg Boss 5 contestant jaswanth padala wiki/bio

తాజాగా ఇన్స్టా స్టోరీ ద్వారా కౌషల్‌.. `తాను, అలీ రెజా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్ లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌస్ నుంచి ముందు నువ్వే బయటకి వచ్చేస్తావ్ సో జాగ్రత్తగా ఆడాలని ఆల్ ది బెస్ట్` అంటూ చెప్పొకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ తో కౌష‌ల్ స‌పోర్ట్ జెస్సీకే అని స్ప‌ష్టంగా అర్థం అయిపోయింది.

 

Share post:

Latest