కంగనా రనౌత్ సినిమాపై. మరొక వివాదం..?

తమిళనాడు మాజీ సీఎం దిగవంత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది.ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమకు తెలియకుండానే తమ సొమ్ము ని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్.

 

ఇక ఈ సినిమాలో విబ్రీ మేషన్ పిక్చర్స్,కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి.కానీ ఇందులో వీబ్రి మోషన్ పిక్చర్స్ అనే సంస్థ వ్యవహారంలోనే గొడవలు బయటపడ్డాయి.ఇక ఇదే క్రమంలో ఇందులో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన భార్య బ్రిందా ప్రసాద్.. విబ్రీ మెషిన్ పిక్చర్ సంస్థకు సంబంధించి 75 లక్షల రూపాయల అక్రమంగా మళ్లించారని ఆ డబ్బుతోనే ఈ సినిమాను నిర్మించాలని ఆరోపణలు చేస్తున్నారు.ఈ విషయంపై విబ్రి మీడియాలో పార్టనర్ గా ఉన్న కార్తీక కృష్ణ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.ఇక పోలీసులు ఈ విచారణ మొదలుపెట్టారు.

Share post:

Latest