జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?

ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తూనే ఉంది.దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలియజేశారు.

ఉపాధి హామీ పథకం:
దేశవ్యాప్తంగా పేద ప్రజలు పస్తులు ఉండకూడదని కారణంచేత యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని 2005లో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.ఎన్ని ప్రభుత్వాలు మారినా..ఈ పథకానికి ఎటువంటి అడ్డంకులు రాలేదు.కానీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను మాత్రం ఇప్పటి వరకు జగన్ సర్కార్ డబ్బులు చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది.

ఆంధ్రప్రదేశ్లో ఉపాధిహామీ పథకం కింద ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 20 కోట్ల పనిదినాలను కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే మొత్తం కూలీలు చేసే పనిదినాలు లెక్కిస్తే 20 కోట్ల రావాలి అన్నమాట వీటిని ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది.డిసెంబర్ వరకు వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది ఆయా ప్రభుత్వాలకు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేవలం 5 నెలల కాలంలోనే తమ ఏడాది కేటాయించిన పని దినాలు అని అసాధారణంగా వాడేసిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం.ఈ వ్యవహారంలో విచారణకు సిద్ధంగా ఉండమని తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.ఇక ఈ ఉపాధి హామీ పథకం పై అవకతవకలు జరిగాయని ఉద్దేశంతోనే ఈ పని చేపడుతున్నట్లు గా అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం లో టాప్ రాష్ట్రాలు ఇప్పటి వరకు కేవలం 60 నుంచి 70 శాతం పనిదినాలు మాత్రమే వాడుకోగా.కానీ ఏపీలో మాత్రం అసాధారణంగా 21 కోట్ల పని దినాలు వాడే డా అనుమానాలకు కారణం అవుతోందని తెలుస్తోంది. అందుచేతనే వీటిపై కేంద్రం నిగ్గు తేల్చాలని నిర్ణయించుకుంది.