కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రెగ్నెన్సీ కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక పెళ్లి అయిన తరువాత చాలా మందిని అడిగే ప్రశ్న విశేషం ఏమైనా ఉందా? కాజల్ విషయంలో కూడా ప్రస్తుతం ఇదే మాట వినిపిస్తోంది. కొందరు అభిమానులు అయితే కాజల్ నోటి నుంచి ఈ శుభవార్త వినాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో కాజల్ ఈ పెదవి విప్పడం లేదు. అంతే కాకుండా ఆమె గర్భవతి అంటూ వార్తలు మాత్రం ప్రచారంలోకి వస్తున్నాయి.

- Advertisement -

అయితే పెళ్లి అయిన తరువాత కొన్ని సినిమాలలో నటిస్తున్న కాజల్ ఆ చిత్రాలను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారని, సైన్ చేసి ఇంకా షూటింగ్ మొదలు కాగానే సినిమాల నుంచి ఆమె తప్పు కుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అలా కాదు తప్పుకుంటున్న సినిమాల్లో నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా కూడా ఒకటి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకోవడానికి ఆమె ప్రెగ్నెన్సీ నే కారణమా లేదా తెలియాలి అంటే ఈ సినిమాలో కాజల్ బదులుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకుంటే అర్థమైనట్టే.

Share post:

Popular