హీరోయిన్ మీరా జాస్మిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాలలో నటించిన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ తర్వాత శివాజీతో కలిసి అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమాకి తొలుత భూమిక నీ హీరోయిన్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుండి తప్పు కుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీరాజాస్మిన్ ఎంచుకోవడం జరిగింది.

కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తరువాత రవితేజతో కలిసి భద్ర సినిమాలో నటించి మంచి మార్కులే సంపాదించింది.ఇక విశాల్ నటించిన పందెంకోడి సినిమా కూడా ఇమే సక్సెస్ కు బాగా దోహదపడింది.ఇక గోరింటాకు సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.చివరిగా బాలకృష్ణ సరసన నటించి ఆ తర్వాత తెలుగు సినిమాల వైపు కనిపించలేదు.

ఇక ఈమె సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం జరిపి. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ను వివాహం చేసుకున్నది. ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ద్వారా హల్చల్ అవుతాయి. వాటిని ఒకసారి చూసేయండి

Share post:

Latest