శ్రీ‌ముఖికి 4 పేజీల లేఖ పంపిన అభిమాని..అందులో ఏముందంటే?

శ్రీ‌ముఖి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెరపై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని మ‌రింత క్రేజ్‌ను పెంచుకుంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

Anchor Sreemukhi Slaying it in Bath Tub

ఇదిలా ఉంటే.. ఈ అందాల యాంక‌ర‌మ్మ‌కు వెంక‌ట్ అనే ఓ అభిమాని ఏకంగా నాలుగు పేజీల ఉన్న లేఖ‌ను పోస్ట్‌లో పంపాడు. ఈ లేఖ‌లో స‌ద‌రు అభిమానులు అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తూ శ్రీముఖి అందాన్ని, యాంకరింగ్‌ను, టాలెంట్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సుధీర్గ‌మైన లేఖ‌లో శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన మలుపులను, ఘట్టాలను ప్రస్తావించాడు.

a hand written four pages letter from fan sreemukhi shocked after reading it

చివ‌రిగా ఈ క‌ళా రంగంలో శ్రీముఖి మరిన్ని శిఖరాలు అధిరోహించాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించాడు. ఇక ఈ లెట‌ర్‌ను చ‌దివిన శ్రీ‌ముఖి ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోయింది. అంతేకాదు, స‌ద‌రు అభిమాని పంపిన లెట‌న్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

a hand written four pages letter from fan sreemukhi shocked after reading it

Share post:

Latest