ఈ ఆహ్వానం తో షర్మిల గెలిచినట్టేనా..? ఏకంగా 300 మందికి ఆహ్వానం ..!

ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ..తన కూతురు షర్మిల భవిష్యత్తు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి , అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలను ఈ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు అనే సమాచారం నిన్నటి వరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది ..కానీ నేడు ఆమె ఎవరికి ఆహ్వానం పలికింది అనే వార్తలు కూడా బయటకు రావడంతో, ఇక ఇది విన్న ప్రజలంతా ఈసారి కచ్చితంగా షర్మిల గెలిచినట్లే అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

 

వైఎస్ విజయమ్మ ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు ఏకంగా 300 మంది కి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఇందులో సంస్మరణ సభ వేదిక మీద 30 మందికి మాట్లాడే అవకాశం కల్పించనున్నారు.. ఈ సంస్మరణ సభకు రాజకీయ నేతలతో పాటు అన్ని రంగాల ప్రముఖులకు కూడా విజయమ్మ ఆహ్వానం పలికారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దర్ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని విజయమ్మ పంపించడం జరిగింది. తెలుగు సినిమా రంగం నుంచి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, దిల్ రాజులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలికారు.

 

అంతేకాదు వైద్యులు ,అడ్వకేట్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లు ,ఐపీఎస్ ఆఫీసర్ లు, రిటైర్డ్ జడ్జి లతోపాటు వివిధ రంగాల ప్రముఖులను కూడా విజయమ్మ ఆహ్వానించడం జరిగింది.. ఇక అంతే కాదు డాక్టర్ గురువారెడ్డి, శాంతా బయోటెక్ ఎండి వరప్రసాద్, గ్లోబల్ ఎండి రవీంద్రనాథ్ తో పాటు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. 2004,2008 సంవత్సరాలలో వైయస్ క్యాబినెట్ లో పనిచేసిన ఉభయ రాష్ట్రాల మంత్రులకు విజయమ్మ కాల్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి మంత్రి సబితా, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా ఆహ్వానించారు.

 

ఇక వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి ,దామోదర, రాజనర్సింహ, గీతారెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆహ్వానం పలికారు. బిజెపి పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ లకు కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కూడా ప్రత్యేక ఆహ్వానం పలికారు. కానీ ఆయన వైఎస్సార్ అంటే అభిమానమే కానీ సభకు రాలేనని చెప్పారు. ఇక చివరిగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విజయమ్మ ఆహ్వానం పలకడం జరిగింది. రేపు జరగబోయే ఈ మహాసభలో ఎవరెవరు ఎలాంటి విషయాలు చర్చిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Share post:

Popular