వరంగల్‌లో వ‌ర్మ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదేనా?

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తున్నారు.

Ram Gopal Varma lands in legal trouble over controversial film?

వ‌రంగ‌ల్‌లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మ‌రియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయ‌బోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Ram Gopal Verma | Zee News

కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం వర్మ వారి విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న ఉండొచ్చు. అయితే ఇప్ప‌టికే ప‌లు బ‌యోపిక్‌లు తీసి వివాదాలు సృష్టించిన వ‌ర్మ‌.. ఈ బ‌యోపిక్‌తో ఇంకెన్ని వివాదాల‌కు తెర లేపుతాడో చూడాలి.

Share post:

Latest