డైరెక్టర్ తేజ కొడుకు.. మరణం వెనుక.. కథ..?

తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ తేజ. ఇక ఆ తర్వాత ఆయన వరుస సినిమాలను చేపట్టారు. డైరెక్టర్ తేజ తన డైరెక్షన్ లో ఎంతో మంది హీరో హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీలో లైట్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఈయన.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. ఇక తేజ వ్యక్తిగత విషయా నికి వస్తే.. ఈయన 1966 ఫిబ్రవరి 22 న మద్రాసు లో జన్మించారు.ఈయన తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడం చేత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఈయన జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన సంఘటన ఇది. అది ఏమిటంటే తేజకి ఒక కొడుకు ఒక కూతురు మాత్రమే ఉన్నారని అందరూ అనుకుంటారు… కానీ డైరెక్టర్ తేజకి వాస్తవానికి ఇంకో కొడుకు కూడా ఉండేవారట.. కానీ డాక్టర్ల నిర్లక్ష్యంతో నాలుగేళ్ల వయసులోనే చిన్నబ్బాయి” అరోవ్ తేజ”మృతి చెందాడు.

శ్వాస కోశ ఇబ్బందితో తనని హాస్పిటల్లో చేర్చగా డాక్టర్ల నిర్లక్ష్యంతో తన కొడుకు చిన్న వయసులోనే మరణించాడు అన్నట్లుగా తేజ ఒక సందర్భంలో తెలియజేశాడు.