దీపావళికి రానున్న పూరీ జగన్నాథ్ వారసుడు..!

 డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. యువ హీరో గా నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాడు ఆకాశ్..ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కేతికశర్మ నటిస్తోంది.ఈ సినిమాకి కథ,స్క్రీన్ప్లే డైలాగ్.. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరీ వహిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్,రెండు పాటలు విడుదల కాగా మంచి స్పందన లభించింది.ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి u/A సర్టిఫికెట్ జారీ చేశారు.ఈ చిత్రంలో ఇక సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ తో సినిమాతో మంచి సక్సెస్ మీద ఉన్న నిర్మాత ఛార్మి కౌర్ -పూరి జగన్నాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4న మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా విడుదల కాబోతోంది. అలాగే రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తై, సినిమా కూడా నవంబర్ 4న విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకు కూడా రొమాంటిక్ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 4న విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Popular