దానికోసం మహేష్ , తారక్ చేస్తున్న పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ గ్రాండ్ రియాల్టీ షో లు ఏవన్నా ఉన్నాయా అంటే, అది కేవలం ఎవరు మీలో కోటీశ్వరులు అలాగే బిగ్ బాస్ అని చెప్పవచ్చు.. ఈ రెండు కూడా పోటీ పడి మరీ సాలిడ్ రేటింగ్ తో ఎంటర్టైన్మెంట్లో దూసుకుపోతున్నాయి..

టీఆర్పీ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న తారక్, మహేష్

ఇదిలా ఉండగా , గత వారం కిందట ఎవరు మీరు కోటీశ్వరులు షో టిఆర్పి రేటింగ్ కొంచెం పడిపోవడంతో, ఆ తర్వాత పలువురు సెలబ్రిటీ తారలను పిలిపించి షో కి హైలెట్ గా నిలిచారు.. ఇప్పుడు మరో సారి షో యొక్క టిఆర్పి రేటింగ్ అమాంతం పెంచడానికి, తారక్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్లాన్ కు మహేష్ బాబు కూడా సరే అని చెప్పాడట.. అంటే ఇక అసలు విషయం ఏమిటంటే , టిఆర్పి మీటర్ ను బద్దలు కొట్టడానికి ఈ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరవడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు వచ్చే లేటెస్ట్ షో లో తారక్ తో పాటు హాట్ సీట్లో కూర్చో డానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.. ఇక ఎటువంటి సందేహం లేకుండా టిఆర్పి మీటర్ ఖచ్చితంగా బద్దలు కొడతారు అనే వార్తలు అభిమానుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

Share post:

Popular