క్రైమ్:15 ఏళ్లుగా ఆ ఇంద్ర భవనం మూసివేత.. కానీ ఇప్పుడు తెరిచి చూస్తే షాక్ అయినా యజమాని..?

త్రిశూర్ లోని థలికుల లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ ఇటీవల ఒక ఇంటిని అమ్మకానికి పెట్టాడు. అది చూడడానికి ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ ఇంటిలో హోటల్ పెట్టాలని ఆలోచనతో ఒక వ్యక్తి ఆ ఇంటిని చూడడానికి వెళ్లగా.. ఆ ఇంటి తలుపులు తీయగానే అతనికి ఒక దృశ్యం చూసి షాకయ్యారు. అక్కడ ఒక దిమ్మికి వేలాడుతున్న కుళ్లిపోయిన శవం కనిపించింది. ఇక ఆ వ్యక్తి ఎవరు?ఎందుకు చనిపోయాడు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

6 నెలల క్రితం మార్చి 18వ తేదీన ఎంగండియార్ కు చెందినటువంటి 17 సంవత్సరాల అమల్ కృష్ణ అనే ఒక యువకుడు తన తల్లి శిల్పా తో కలిసి వదనప్పల్లి లోని బ్యాంకు కి వెళ్ళాడు. కానీ ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు. బ్యాంకుకు తనతోపాటు వచ్చిన కుమారుడి కోసం ఆ తల్లి ఎక్కడ ఎక్కడ వెతికినా ఫలితం లభించలేదు. దాంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక యువకుడిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు..

6 మాసాలుగా పోలీసులు యువకుడి గురించి వెతుకుతున్నారు. కాకపోతే ఒక ఎన్నారై 15 సంవత్సరాలుగా ఎటువంటి ఉపయోగం లేకుండా త్రిసూర్ లోని థలికులంలో ఇంటిని అమ్మకానికి పెట్టడంతో , ఇల్లు చాలా విశాలంగా ఉండటం చూసిన ఒక వ్యక్తి అందులో హోటల్ పెట్టుకోవాలని నిర్ణయించి, ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి వచ్చాడు.. ఇక ఆఇంటి తలుపు తీయగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న శవాన్ని చూసి గుండె ఆగినంత పనైంది.. అక్కడ పక్కనే గోడకు ఫోన్ నెంబర్ లు ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, ఎవరిదో ఆ శవం అని ఆరాతీయగా ఆరు మాసాల కిందట తప్పిపోయిన అమల్ గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

వెంటనే పోలీసులు శిల్ప దంపతులకు ఫోన్ చేయడంతో ఆమె వచ్చి తన కొడుకేనని నిర్ధారించింది.. కానీ డీఎన్ఏ టెస్ట్ పూర్తయ్యేవరకు మృతదేహాన్ని పోలీసులు ముట్టచెప్పమని చెప్పారు. ఆ యువకుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు

Share post:

Popular