క్రైమ్: హైదరాబాదులో చైత్ర ఘటన మరవకముందే మరో అరాచకం..!

హైదరాబాదులో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇకపోతే మొన్నటికి మొన్న సైదాబాద్ లో సింగరేణి కాలనీ లో నివాసం ఉంటున్న చైత్ర అనే 6 యేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన ఇంకా మరవకముందే , పాతబస్తీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. హైదరాబాద్ లోని రక్షాపురం కాలనీ కి చెందిన ముజీబుర్ రెహ్మాన్ అలియాస్ 21 సంవత్సరాల వయసు కలిగిన షోయబ్ మద్యానికి బాగా బానిసయ్యాడు..

- Advertisement -

ఆగస్టు 31వ తేదీన 10 సంవత్సరాల బాలిక తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి వెంటనే వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఛత్రినాక పోలీసులకు అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ స్థలానికి వెళ్లి చూడడంతో ఆ యువకుడు అక్కడ కనిపించలేదు.. అతడు మళ్ళీ మంగళవారం బస్తీ కి వచ్చి అమ్మాయితో అలాగే అసభ్యకరంగా ప్రవర్తించడంతో సీసీ కెమెరాల్లో రికార్డయింది..

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి మరోసారి వాళ్ల తల్లిదండ్రులకు చెప్పడంతో, బస్తీవాసులు ద్విచక్ర వాహనంపై వెళ్లి అతడిని వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.. వాడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది.. ఇక నుంచైనా ఆడ పిల్లలు.. వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

Share post:

Popular