కోర్టులో సమంత చైతు విడాకులకు సంబంధించి.. న్యూస్ లీక్…!

టాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా సమంత నాగచైతన్య విడాకులు విషయం బాగా పాపులర్ అవుతోంది.ఈ విషయంపై వీరిద్దరి ఫ్యామిలీ కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ఇక సమంత వరుసబెట్టి సినిమాలను చేస్తూ బాగా దూసుకెళ్తోంది.ఇక అలాంటి సమయంలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని వార్త విని తమ అభిమానులను బాధ కలిగించేలా ఉంది.

 

ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో సమంత విడిపోతున్నానంటూ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఇప్పుడు అవన్నీ నిజం చేసేలా సమంత ప్రతిరోజు కొన్ని పోస్టులను షేర్ చేస్తూ ఉంది.అయితే కొన్ని ప్రముఖ ఛానల్లో తెలిపిన ప్రకారం.. వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అని తెలియజేశారు.అంతేకాకుండా వీరికి సంబంధించి విడాకుల పత్రాలు కోర్టులో కౌన్సిలింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.

మొన్న సోషల్ మీడియాలో తన ఇంటి పేరును తీసేసిన సమంత వరుస సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నది. కానీ ఎప్పుడైనా నాగచైతన్య కోసం ఆమె టైం కేటాయించేది కానీ ప్రస్తుతం ఇప్పుడు అలా చేయలేదు అనే తరుణంలో తన అభిమానులు కూడా ఇది నిజమైన అన్నట్లుగా భావిస్తున్నారు.ఇక గోవా టూర్లో బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఒకరోజు కోర్టు కు వచ్చి వెళ్లినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఇక వీరిద్దరి వివాహం 2017 అక్టోబర్ 7న జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్నారు ఈ దంపతులు.ఒక విషయం మాత్రం ఇప్పుడు ఎక్కువగా బాగా ప్రచారం అవుతున్నది ఆ విషయం ఏమిటంటే.. సమంత సినిమాలు చేస్తూ తమ కుటుంబానికి సమయం కేటాయించలేదని అందుచేతనే వీరు విడిపోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.ఇక నాగార్జున భార్య అమలవలె పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ఉండాలని అక్కినేని ఫ్యామిలీ ఆశిస్తుండగా..దానికి సమంత ఒప్పుకోలేదు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇక సమంత కొన్ని పోస్ట్ లు పెట్టడం ద్వారా ఇలాంటివన్నీ నిజమేనేమో అనిపించేలా గా ఉన్నాయి.