కూల్ డ్రింక్ తాగడంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..కారణం..!

ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా తప్పకుండా కూల్ డ్రింక్స్ వుండాల్సిందే.. ఇక అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే అందులో పురుగుల మందులు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అయితే వాటి మోతాదు తక్కువగా ఉండడం వల్ల, కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అది స్లో పాయిజన్ గా ఎక్కుతుందట.

అసలు విషయానికి వస్థే, చైనాకు చెందిన ఒక వ్యక్తి..1.5 లీటర్ల కోకో కోలాను కేవలం పది నిమిషాల్లోనే తాగేసాడట. అలా తాగిన కొద్ది గంటల తర్వాత అతని శరీరం అదుపు తప్పింది. అతను కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయిందట, తీవ్రమైన కడుపు నొప్పితో అతడి దగ్గర్లోనే ఉండే హాస్పిటల్ కు చేరగా.. వైద్యులు సిటి స్కాన్ చేసి కడుపులో గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు.

బాడీలో కొన్ని శరీరాలలో గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆ వైద్యులు తెలియజేశారు. ఇలా ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ అందక అది నిలిచిపోతుందని తెలియజేశారు. చివరిగా వైద్యులు అతడిని రక్షించ లేకపోయారు. ఆ వ్యక్తి శరీరం నుంచి గ్యాస్ బయటకు తీసేయడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం దక్కకుండా పోయింది. వైద్యులు అతనికి కాపాడేందుకు సుమారుగా 18 గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు.