చైతన్య – సమంత ఒక్కటవ్వాలని వేడుకుంటున్న అభిమాని..!

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత.ఇద్దరి జోడి అంతులేని అభిమానులను సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం అక్కినేని అభిమానులకు ఎంతగానో హర్ట్ అయ్యేలా చేస్తోంది. అయితే తాజాగా ఈ రోజున నాగ చైతన్య నటించిన చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అక్కినేని ఫ్యాన్స్.. సందడి మామూలుగా లేదు.

లవ్ స్టోరీ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. అక్కడున్న అభిమానులతో.. సినిమా పై అభిప్రాయం సేకరించేందుకు మీడియా సంస్థలు,పలు టీవీ ఛానల్స్ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. అయితే లవ్ స్టోరీ సినిమా పై తన ఫీలింగ్స్ ను బయటపెట్టిన ఒక డై హార్డ్ ఫ్యాన్.. సమంత డివోర్స్ విషయం అడగడంతో ఓ రేంజ్ లో ఎమోషనల్ అయ్యాడు.

లవ్ స్టోరీ సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీ ఈ సినిమా చూస్తే బాధలన్నీ మర్చిపోవచ్చు అని అభిమాని చెబుతూ ఉండగా.. సమంత విడాకులపై ఒక మీడియా ప్రశ్న వేయడంతో.. ఆ మీడియా పై ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు సదరు అభిమాని.. సమంత విడాకులు అంటే నరికేస్తా.. ఇద్దరూ కలిసి ఉండాలి ప్లీజ్ మీ ఇద్దరూ ఇలా కలిసి ఉంటే మీ ఇంటికి వస్తా.. మికోసం ఏదైనా చేస్తాను అంటూ కంటతడి పెట్టుకున్నాడు.ఇప్పుడు ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికైనా ఈ విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Popular